![]() |
![]() |

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక విషమాన్ని ఒక షోలో బయట పెట్టింది నిహారిక కొణిదెల. నాగబాబు కూతురిగా ఎన్నో షోస్ లో సందడి చేస్తూ ఉంటుందామె. తాజాగా నిహారిక క్యాష్ ప్రోగ్రాంకి వచ్చి చాల విషయాలు చెప్పింది. ఈ షోకి నిఖిల్, అనిల్, 'దేవుళ్ళు' మూవీలో చిన్నపిల్ల క్యారెక్టర్ లో నటించిన నిత్యాశెట్టి వచ్చారు. ఈ షోలో సుమ నిహారికకు ఒక టాస్క్ ఇచ్చి, ఒక ప్రశ్న వేసింది.
"నీ మాటలతో, చేతలతో, చేష్టలతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరిని ఈజీగా కన్విన్స్ చేయగలవు?" అనడిగింది. చిరంజీవి పేరు చెప్పేసింది నిహారిక. "బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను నమ్మించడం కష్టం. పెదనాన్నని ఈజీగా కరిగించేయొచ్చు" అంటూ చెప్పింది నిహారిక. "బ్రేకింగ్ న్యూస్.. చిరంజీవి గారికి ఏ అబద్ధం చెప్పినా నమ్ముతారు, పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలకు అస్సలు పడరు. ఆయన్ని కరిగించడం ఇంపాసిబుల్ అని క్యాష్ ప్రోగ్రాంలో చెప్తున్నారు. ఓవర్ టు యు సుమ" అని కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు నిఖిల్.
"నువ్వేమో మణికొండ, వీళ్ళ బ్రదర్ గడ్డలకొండ" అంటూ సుమ వార్నింగ్ ఇచ్చేసరికి, "ఇంకేం అనకొండ" అంటూ నిఖిల్ కౌంటర్ వేశాడు. ఫైనల్ గా "మేమంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం" అన్నాడు నిఖిల్. దాంతో "నేను ఎంటర్టైన్ చేయడానికి రాలేదు, ఎదవను చేయడానికి వచ్చాను" అని పంచ్ వేసింది నిహారిక. ఇలా ఈ షో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది.
![]() |
![]() |